
తొలి శుభోదయం:-
మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పర్యటించి ప్రజల సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు భోజనం, మెడిసిన్, మంచినీరు, పాలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు.మిర్చి యార్డు, పుల్లయ్య మున్సిపల్ హైస్కూల్, చిన్మయ స్కూల్ కేంద్రాలను సందర్శించిన గళ్ళా మాధవి , ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ – “గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 23 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. అధికారులు, పార్టీ కేడర్, సచివాలయ సిబ్బంది అందరూ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఏ అవసరమున్నా నేరుగా మా కార్యాలయాన్ని లేదా స్థానిక కార్పొరేటర్లను సంప్రదించండి, మేము వెంటనే స్పందిస్తాం” అని భరోసా ఇచ్చారు.ప్రభుత్వం ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ తుఫాన్ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.