
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము సందర్భంగా ఈరోజు స్పెషల్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. మొదట మహాత్మా గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఈరోజు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవమని 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1993) అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం ఈ దినోత్సవం జరుపుకుంటారని, ప్రజల భాగస్వామ్యం గ్రామాల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ విద్య ఆరోగ్యం పంచాయతీరాజ్ బలపడటం గ్రామ అభివృద్ధికి బాటలు వేయడం దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఓ కిరణ్, మాజీ సర్పంచ్ వీరమ్మ, నాగేశ్వరరావు, స్వర్ణ గ్రామం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.