
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు
ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ మరియు నేత్రపురి శ్రీరామసేవక్ సంయుక్త ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రము మరియు ఉచిత మజ్జిగ పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుడ్లూరు ఎంపీడీవో వై వెంకటేశ్వరరావు గురువారం ఉదయం 11:10 నిమిషాలకు ప్రారంభించడం జరిగింది. ఎంపీడీవో గారు వారి చేతుల మీదుగా గ్రామస్తులకు మంచినీరు మరియు మజ్జిగ అందించడం జరిగింది. ఈ సందర్భంగా యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు అద్దంకి అజయ్ బాబు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమైందని ఈ వేసవిలో వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలన్న సంకల్పంతో ఈ మంచినీటి చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు, నేత్రపురి శ్రీరామసేవక్ సభ్యులు ఎయిర్టెల్ చిన్న మాట్లాడుతూ గత సంవత్సరం కూడా మేము ఈ మంచినీటి చలివేంద్రాన్ని మరియు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నాలుగు నెలల పాటు నిర్వహించి మండలంలోని ప్రజల మన్ననలు పొందామని, ఈ సంవత్సరం మా మిత్రులు అద్దంకి అజయ్ బాబు నిర్వహిస్తున్నటువంటి యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ మరియు నేత్రపురి శ్రీరామసేవక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మంచినీటి చలివేంద్రం మరియు ఉచిత చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దాతల సహకారంతోనే ఏ సేవ కార్యక్రమం అయినా విజయవంతంగా నడుస్తుందని తెలియజేశారు. మిత్రులు అజయ్ బాబు వారు నిర్వహిస్తున్నటువంటి యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వర్తించి అందరి చేత మన్ననలు పొంది ఉన్నారు. అలాంటి మా మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం,మా రెండు సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమన్ని నిర్వర్తించటం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీడీవో వెంకటేశ్వరరావుని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అజయ్ బాబు ఎయిర్టెల్ చిన్న ఇన్నమరి సుధాకర్ శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు అద్దంకి అజయ్ బాబు ,, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్న వెంకటేశ్వర్లు , దామా వెంకటేశ్వర్లు ,జోన్నలగడ్డ రవణమ్మ,రావూరి వేణుగోపాల్, పువ్వాడ వేణుగోపాల్, జంపాల ప్రసాదు మలిశెట్టి ఏసుబాబు గుడ్లూరు మండల బిజెపి మాజీ అధ్యక్షులు ఇన్నమూరి. సుధాకర్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు సన్నిశెట్టి గిరిబాబు,మాజీ సర్పంచ్ మేకపోతుల రాఘవయ్య, ఆర్యవైశ్య పెద్దలు తుమ్మలపెంట కొండయ్య శెట్టి, ఇన్నమూరి గారటయ్య, ఆర్యవైశ్య యువకులు,మీడియా మిత్రులు గుర్రం ఆదినారాయణ,చెన్నాయి పాలెం ఆంజనేయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మంచి నీటి చలివేంద్రం ప్రారంభం సందర్భంగా యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్టు నిర్వాహకులు అజయ్ బాబు గారు గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.
