
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ నేతృత్వంలో ఆటో రిక్షాల్లో అమర్చిన అక్రమ ఎల్ఈడి లైట్లపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా పలు ఆటోలను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్ఈడి లైట్లను అక్కడికక్కడే తొలగించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రయాణ సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, రోడ్డు భద్రతా నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రత కోసం వాహనాల్లో అనుమతి లేని మార్పులు చేయరాదని, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.