
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar గారి పేరుతో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారిని దళిత సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారి సమక్షంలో, దళిత సంఘాల ప్రతినిధులు శాలువాలు, పూలమాలతో కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దళిత సంఘాల నేతలు నేరెళ్ల జాన్, గర్నెపూడి ప్రేమ్ కుమార్, కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, రమేష్, గర్నెపూడి యాకోబు, ప్రేమ్ కిషోర్ తదితరులు, అలాగే పలువురు దళిత యువకులు పాల్గొన్నారు.