
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎస్పీగా కొనసాగుతున్న లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్పీల బదిలీలలో భాగంగా శనివారం ఈ నియామకం చేపట్టారు.బాలమురళీకృష్ణ ప్రస్తుతం వైజాగ్ క్రైమ్ బ్రాంచ్‌లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో సీఐగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయనకు మంచి పేరు ఉంది.ఇక దర్శిలో శాంతిభద్రతల డీఎస్పీగా ఇది ఆయన తొలి పోస్టింగ్‌గా చెప్పవచ్చు.