
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి దర్శి నియోజకవర్గానికి చెందిన మహిళలు, డ్వాక్రా గ్రూప్ సంఘాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సందర్శించి, మహిళల స్వయం ఉపాధి ప్రయత్నాలను అభినందించారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని, తమ ప్రతిభతో సమాజంలో మరింత ముందుకు రావాలని ప్రోత్సహించారు.