
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి పట్టణంలోని కురిచేడు,అద్దంకి రోడ్డు వద్ద ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని దర్శి ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం ప్రాణ రక్షణకు ఎంత ముఖ్యమో వివరించారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.ప్రజలు పోలీసులకు సహకరించి రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా పోలీసులు తెలిపారు.