
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శిలో రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచే లక్ష్యంతో సీఐ శ్రీ రామారావు గారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకునే విధానాలు, తప్పనిసరిగా హెల్మెట్ వాడకం, మరియు ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి కీలక అంశాలను ప్రజలకు వివరించారు. సీఐ వ్యక్తిగతంగా డ్రైవర్లు, మోటార్‌సైకిల్ వాహనదారులతో చర్చించి, ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతను పాటించి, ట్రాఫిక్ నియమాలను గౌరవించాలని దర్శి పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణే లక్ష్యంగా, రోడ్లపై కట్టుదిట్టమైన చర్యలు అమలు చేయనున్నారు.