
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో కావలి వాస్తవ్యులు (ఒంగోలు బస్టాండ్) గాదంశెట్టి వెంకట సుబ్బ నరసింహ స్వాములు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం 11. 00 గంటలకు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని నరసింహ స్వాముల సమీప బంధువు కొత్తురి.శ్రీనివాసులు మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ బాబు గారు బస్టాండ్ సెంటర్లో ఉన్న ప్రయాణికులకు, చల్లని మజ్జిగను వారి చేతుల మీదుగా అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.నేత్రపురి శ్రీరామసేవక్ కార్యనిర్వాహకులు అయినటువంటి ఎయిర్టెల్ చిన్నా మాట్లాడుతూ గుడ్లూరుకు చెందిన యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ మరియు నేత్రపురి శ్రీరామసేవక్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవికాలం ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మంచినీటి చలివేంద్రo అందుబాటులో ఉంచామని ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలియజేశారు. మేము చేసే ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా చూసినటువంటి శ్రీ గాదంశెట్టి వెంకట సుబ్బ నరసింహస్వాములు తాను కూడా తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు తన వంతుగా కొంతైనా సహాయ సహకారాలు అందించాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించి మా ద్వారా ఈ చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జరిపించారు. గాదంశెట్టి నరసింహ స్వాములు లాగా ప్రతి ఒక్కరూ సేవా భావంతో ఉండాలని సేవా కార్యక్రమాలు చేసే వారికి సహకరించాలని కోరేరు .ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా 250 మందికి చల్లని మజ్జిగ అందించడం జరిగిందని తెలియజేశారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన గాదంశెట్టి నరసింహ స్వాములు కి మంచినీటి పంపిణీ కార్యక్రమానికి సహకరించిన గుండ్లపల్లి నాగేంద్ర కి మా రెండు ట్రస్టుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో , నేత్రపురి శ్రీరామ సేవక్ కార్యనిర్వాహకులు ఇన్నమరి ప్రమీల సుధాకర్, ఎయిర్టెల్ చిన్న, యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ బాబు, అమరా మాల్యాద్రి,, కొత్తూరు శ్రీనివాసులు, పూజిత మెడికల్స్ మనోహర్, పాజర్ల బ్రహ్మయ్య, గొల్ల.మణి, రామిశెట్టి సురేష్ మీడియా మిత్రుడు గుర్రం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.