
తొలి శుభోదయం సింగరాయకొండ:-
కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న రాష్ట్రంలోని దివ్యాంగ సోదరి–సోదరులకు ఇంద్రధనస్సు లాంటి ఏడు వరాలను ప్రకటించిన శుభ సందర్భంగా సింగరాయకొండ మండలంలో ఘన కార్యక్రమం నిర్వహించారు.పద్మ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆనాల సురేష్, రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు గుమ్మా రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న బాలాజీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద మాదిగ, కొండేపి నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పూనూరి కృష్ణాఫర్ మాదిగ, సింగరాయకొండ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రాజారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సింగరాయకొండ మండల కూటమి ప్రభుత్వ నాయకులు వేల్పుల సింగయ్య, మండల అధ్యక్షులు మించాల బ్రహ్మయ్య, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు చంటి, టీడీపీ నాయకులు కునపురెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమానికి తీసుకొచ్చిన చారిత్రాత్మక నిర్ణయాలకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు ప్రకటించారు.అనంతరం “జై నారా చంద్రబాబు నాయుడు”, “జై తెలుగుదేశం”, “జై డోలా బాల వీరాంజనేయ స్వామి నాయకత్వం వర్ధిల్లాలి”, “జై దామచర్ల సత్యనారాయణ నాయకత్వం వర్ధిల్లాలి”, “జై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి”, “జై వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ దివ్యాంగ సోదరి–సోదరులు, నాయకులు, కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు మరియు కన్వీనర్ సన్నిబోయిన నాగేశ్వరరావుతో పాటు పలువురు దివ్యాంగ సోదరి–సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
