
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీమకూర్తి సీఐ డి. ప్రసాద్ పర్యవేక్షణలో చీమకూర్తి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దాడి నిర్వహించారు.చీమకుర్తి మండలం దేవరపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లో అక్రమంగా జరుగుతున్న జూదాటపై ఖచ్చితమైన సమాచారం అందడంతో, పోలీసులు వెంటనే స్పందించి అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జూదగాళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ₹18,620/- నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం ప్రజలకు ఆర్థిక, సామాజిక నష్టాలను కలిగించే తీవ్రమైన నేరంఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతర చర్యలు కొనసాగుతాయిగ్రామాల్లో శాంతి-భద్రతల కోసం పోలీసులు ఎల్లప్పుడూ పర్యవేక్షణలో పనిచేస్తున్నారుఅక్రమ జూద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.