
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
దొనకొండలో నిర్వహిస్తున్న కనకదుర్గమ్మ తిరునాళ్ల సందర్భంగా భక్తుల రద్దీ మరియు ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ‘స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్’ ద్వారా డ్రోన్ నిఘా నిర్వహిస్తూ తిరునాళ్ల ప్రాంగణం, ప్రధాన రహదారులు మరియు పార్కింగ్ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.డ్రోన్ కెమెరాల సహాయంతో భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ పరిస్థితులను గమనిస్తూ ఎక్కడైనా అధిక రద్దీ ఏర్పడితే వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సాంకేతిక పర్యవేక్షణ వల్ల భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరునాళ్లలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.పోలీసులు భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరునాళ్లు ప్రశాంతంగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.