
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
చీరాలకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక ఆటోలో ప్రయాణించి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం ఆటో డ్రైవర్‌కు చెల్లింపు చేసి వెళ్లిపోయిన ఆయన, తన పర్సును ఆటోలోనే మర్చిపోయారు. ఆ పర్సులో సుమారు రూ.15,000 నగదు మరియు విలువైన కార్డులు ఉన్నాయి.తర్వాత పర్సును గమనించిన ఆటో డ్రైవర్ ఒంగోలు మండలం, కరవాది గ్రామానికి చెందిన గరిక ముక్కల అంజిబాబు దానిని సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రవికి అప్పగించారు. పర్సులో ఉన్న వివరాల ఆధారంగా శ్రీనివాసరావుకు సమాచారం అందించగా, అతను రైల్వే స్టేషన్‌కు చేరుకుని తన పర్సును తీసుకున్నాడు. విలువైన దొరికిన పర్సు ను ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించి తన ఔనత్యం చాటుకున్న ఆటో డ్రైవర్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. అభినందించారు. తక్కువ సమయంలో తమ వివరాలు తెలుకొని పర్సును తమకు తిరిగి అప్పగించి తమలో తిరిగి ఆనందాన్ని నింపినందుకు ఆ వ్యక్తి పోలీస్ లకు, ఆటో డ్రైవరుకు కృతజ్ఞతలు తెలియజేశారు.