
తొలి శుభోదయం ప్రకాశం :-
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధతో వచ్చే ఫిర్యాదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలినేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలి
పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి నాగులుప్పలపాడు మరియు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లను మంగళవారం జిల్లా ఎస్పీ గారు ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని,గదులను, మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, సిడి ఫైల్స్ ను మరియు పలు రికార్డులను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే పిర్యదుదారులకు పరిష్కారం అందించాలన్నారు.
బహిరంగ మద్యపానం జరిగే ప్రదేశాలను గుర్తించి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా ప్రదేశాలను పరిశుభ్రంగా చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. బహిరంగ మద్యపానం అరికట్టడం వల్ల నేరాల శాతం గణనీయంగా తగ్గిందన్నారు.
ఫిర్యాదు దారుల ఫిర్యాదులపై సరైన రీతిలో క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు, పిటిషన్ విచారణలు మరియు కేసుల పరిష్కారంపై సమీక్షించారు.
స్టేషన్ లో సిబ్బంది విధులను గురించి జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు. మరింత సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సమర్ధవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.కేసుల పరిశోధనలో సిబ్బందిని కూడా భాగస్వాములను చేసి వారిలో నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. పాత నేరస్థులు, సస్పెక్ట్ ల తో వ్యక్తిగతంగా మాట్లాడి వారి జీవన విధానం మరియు ఇతర ఇతర విషయాలు అడిగి తెలుసుకోవాలన్నారు. వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు.ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సి.డి ఫైల్ లో ఉంచి దర్యాప్తు ప్రక్రియ సజావుగా జరిగేలా, దర్యాప్తు నైపుణ్యం పెంపొందించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక ఫైల్ ను సీసీటీఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలన్నారు.ప్రతి రోజు తాము ఇచ్చే ఆదేశాలను క్రింది స్థాయి సిబ్బందికి తెలియచేయాలని ఆదేశించారు. ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి రోజు గ్రామా/వార్డులకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలన్నారు. ఆయా ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.జిల్లా ఎస్పీ గారి వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, యన్.జి పాడు ఎస్సై రజియా సుల్తాన్, మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య మరియు సిబ్బంది ఉన్నారు.
