
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-
రాత్రివేళల్లో డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు, అలసట వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నమైన ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో అర్ధరాత్రి 1:00 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడుక్కునే సౌకర్యం కల్పించడం, టీ అందించడం ద్వారా అలసటను తగ్గించి అప్రమత్తత పెంచుతున్నారు. “సురక్షితంగా గమ్యం చేరడం మాత్రమే కాదు… మీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల కోసం కూడా జాగ్రత్తగా ఉండండి” అని పోలీసులు సూచిస్తున్నారు.చిన్న విరామం – పెద్ద రక్షణ అనే సందేశంతో డ్రైవర్లలో అవగాహన పెంచుతూ, రాత్రివేళల్లో ప్రమాదాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేపడతామని పోలీసులు తెలిపారు.