
కందుకూరు నియోజవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి తోరణాలు, ముత్యాల ముగ్గులు, పిండి వంటలతో ఇళ్లు కళకళలాడాలి. మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం విరబూయాలి. ఆనందాలు, సంతోషాల నడుమ ఈ సంక్రాంతి పండుగను సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.