
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలో నివసిస్తున్న యానాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. మంగళవారం కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల ఆరు పూరి గుడిసెలు కుప్పకూలియి. దీంతో ఆ ఆరు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. ఇంటిలోని బియ్యం నిత్యవసర సరుకులు మొత్తం వానలో తడిచిపోవడంతో తమ పిల్లలకి కడుపునిండా ఆహారం పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని యానాది కుటుంబ సభ్యులు వాపోయారు. అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఇటువైపు కన్నీటికి కూడా ఎవరు చూడలేదని దాతలు మా కుటుంబాలను ఆదుకోవాలని యానాది కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.