
తొలి శుభోదయం అద్దంకి:-
అద్దంకి ఏరియా పశువైద్యశాల ఆవరణలో డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పశు వైద్య సహాయకుల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. జాయింట్ డైరెక్టర్ డా. వెంకటేశ్వరరావు సెక్స్ చార్టెడ్ సెమెన్ విరివిగా వినియోగించి సాధారణ ఎద ఇంజక్షన్లను తగ్గించవలసిందిగా తెలియజేశారు. దీని ద్వారా 95 శాతం ఆడ దూడలు పుట్టే విధంగా ప్రణాళికను తయారు చేసుకుని గ్రాస్ వేల్యూ ఎడిషన్ పెంచుకోవాల్సిందిగా సూచనలను ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని విషయాలలో నూరు శాతం ప్రగతి సాధించవలసిందిగా తెలియజేశారు. ప్రతి ఆర్ ఎస్ కే లో పనిచేసే ఎనిమల్ హస్బండ్రీ అసిస్టెంట్స్ జీవీఏ ఏ విధంగా తయారు చేయాలో తెలియజేశారు. అద్దంకి మండలంలోని ధర్మవరం గ్రామంలో మండలానికి సంబంధించిన మెగా గోకులం కు సంబంధించిన స్థలాన్ని ధర్మవరం లో పరిశీలించారు. ధర్మవరంలోని రైతు సేవ కేంద్రం పరిశీలించి అక్కడ పని చేస్తున్న అనిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ గ్రేస్ అమ్మతో ఇంటరాక్ట్ కావటం జరిగిందన్నారు. జీవీఏ మీద ఎలా తర్ఫీదు కావాలో తెలియ జేశారు .మండల కేంద్రమైన అద్దంకిలోనీ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఉన్న ల్యాబ్ ను సందర్శించారు.. 1962 సిబ్బందితో వారి కార్యక్రమా వివరాలను అడిగి తెలుసుకున్నారు.