
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గుడ్లూరు వాస్తవ్యులు కీర్తిశేషులు కొత్తూరు వెంకటేశ్వర్లు గారి ధర్మపత్ని పద్మావతమ్మ గారి వర్ధంతి తిధి సందర్భంగా వ్యాపార రిత్యా అనంతపురంలో ఉంటున్నటువంటి కొత్తూరు సురేష్ (చిన్న) కుటుంబ సభ్యుల సహకారంతో అల్పాహారం (పులిహోర ) పంపిణి,మరియు కందుకూరు వాస్తవ్యులు పద్మనాభునిసురేష్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా నేత్రపురి శ్రీరామసేవక్ కార్యనిర్వాహకులు మాట్లాడుతూ వేసవిలో కొందరి దాహర్తిని అయినా తీర్చాలన్న సంకల్పం తో మేము వేసవికాలం ముగిసే వరకు మంచినీటి చలివేంద్రాన్ని మరియు అలాగే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని, అలాగే దాతల కోరిన రోజు వారి సహకారంతో పేదలకు మరియు ప్రయాణికులకు కొంత ఆకలినైనా తీర్చాలని సంకల్పంతో అల్పాహార పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమనికి ఎక్కడో అనంతపురంలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి కొత్తూరు సురేష్ బాబు గారు తన స్వగ్రామం అయినటువంటి గుడ్లూరులో జరుగుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాo ద్వారా అల్పాహార ( పులిహోర ) పంపిణీకి సహకరించటం అభినందనీయమని అన్నారు అలాగే తదుపరి వైశాఖ మాస ఆరంభ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మాసంలో జలధానం చేయటం వలన దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన కందుకూరు వాస్తవ్యులు పద్మనాభుని సురేష్ ధర్మపత్ని సౌజన్య గార్లు ఈరోజు చల్లని మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించారు. ఈ ఇరువురి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు , అలాగే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుడ్లూరు మండలం సొసైటీ అధ్యక్షులు మాకు అత్యంత ఆప్తులు దామా వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు, ఇప్పటివరకు ఈ చల్లని మజ్జిగ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన దాతలు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో , నేత్రపురి శ్రీరామసేవక్ కార్యనిర్వాహకులు ఇన్నమూరి సుధాకర్, ఎయిర్టెల్ చిన్న, పెద్దలు తుమ్మల పెంట కొండయ్య శెట్టి,ఇన్నమూరి గరటయ్య,అమరా మాల్యాద్రి,ఇన్నమూరి. గరటయ్య, గొల్ల నాగరాజు, పూజిత మెడికల్స్ మనోహర్,పాజర్ల బ్రహ్మం, జలగం అశోక్ గొల్ల.మణి కంఠ , తదితరులు పాల్గొన్నారు.
