
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో కందుకూరు వాస్తవ్యులు గుర్రం శ్రీ లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మహేష్ కుమార్, సుమన్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం 11. 00 గంటలకు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని నేత్రపురి శ్రీరామసేవక్ కార్యనిర్వాహకులలో ఒకరైన ఇన్నమూరి. సుధాకర్ గారూ బస్టాండ్ సెంటర్లో ఉన్న ప్రయాణికులకు చల్లని మజ్జిగను వారి చేతుల మీదుగా అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యనిర్వాహకులలో మరొక రైనటువంటి ఎయిర్టెల్ చిన్న మాట్లాడుతూ గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మరియు మంచినీటి చలివేంద్ర కేంద్రాన్ని మొన్నటి ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభించామని గుడ్లురుకు చెందిన యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ మరియు నేత్రపురి శ్రీరామసేవక్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు మంచినీటి చలివేంద్రము మరియు వారానికి మూడు నుండి నాలుగు రోజులపాటు ఈ చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి దాతలు అందరూ సహకరించలని కోరారు. వేసవికాలంలో జలదానం అంటే మంచినీరు,మజ్జిగ,శీతల పానీయాలు ఇలాంటి వాటిని దానాo చేసి కొందరి దాహార్తి నైనా తీర్చటం ఎంతో పుణ్య కార్యక్రమమని మన పురాణాలు చెబుతున్నాయని తెలియజేశారు.సోషల్ మీడియాలో మేం పెట్టే పోస్టులను చూసి మంచి మనసుతో స్పందించి కందుకూరుకు చెందిన మా మిత్రుడు మహేష్ ఈరోజు వారి తల్లి గారి జ్ఞాపకార్థం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు వారికి,వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల బిజెపి మాజీ అధ్యక్షుడు, నేత్రపురి శ్రీరామ సేవక్ కార్యనిర్వాహకులు ఇన్నమరి ప్రమీల సుధాకర్, ఆర్యవైశ్య సంఘo ఉపఅధ్యక్షుడు ఎయిర్టెల్ చిన్న, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అమరా మాల్యాద్రి,,ప్రధాన కార్యదర్శి ఇన్నమూరి గరటయ్య, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తూరి
శ్రీనివాసులు,గుడ్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సన్నిశెట్టి గిరిబాబు, పాజర్ల బ్రహ్మయ్య, మీడియా మిత్రులు జవంగుల సుధాకర్, సి. హెచ్.ఆంజనేయులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
