
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, POCSO కేసులు, మహిళలపై నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు వంటి అంశాలపై వివరించారు. అలాగే సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం అనుమానాస్పద కాల్స్, OTPలు, లింకులు పంచుకోవద్దని సూచించారు.పిల్లలపై లైంగిక నేరాల నివారణకు సంబంధించి POCSO చట్టం ప్రాముఖ్యతను వివరించి, తల్లిదండ్రులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించే విధానం, అందుబాటులో ఉన్న సేవలను తెలియజేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో నేరాలను తగ్గించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పోలీసులు తెలిపారు.