
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాలను నియంత్రించడం మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడం లక్ష్యంగా ఆదివారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లాలోని పాత, పాడుబడిన బిల్డింగులు, అలాగే శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు మరియు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఈ నిఘా ద్వారా నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.డ్రోన్ కెమెరాల సహాయంతో గుంపులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమ కార్యకలాపాలను వెంటనే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన సాంకేతిక నిఘా వల్ల జిల్లాలో నేరాల తగ్గింపుతో పాటు ప్రజల్లో భద్రతాభావం మరింత పెరుగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు. పాత బిల్డింగులు లేదా శివారు ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా 112 నెంబర్కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 కు సమాచారం అందించాలని పోలీస్ అధికారులు కోరారు.