
తొలి శుభోదయం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు రాత్రి సమయంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి నేరాలు చోటుచేసుకోవకుండా కట్టుదిట్టమైన తనిఖీలు, అనుమానితుల విచారణ, లాడ్జీలు–వాహనాల పరిశీలన, మరియు గస్తీ నిర్వహణ వంటి చర్యలను నిరంతరం అమలు చేస్తున్నారు.FINS సాంకేతికత ద్వారా అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్లను వెంటనే చెక్ చేసి వారి క్రిమినల్ హిస్టరీని గుర్తించే అవకాశం ఉండటంతో, పోలీసులు నేరాలను ముందస్తుగా అరికట్టే దిశగా మరింత సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు.జిల్లాలో శాంతి–భద్రతలను కాపాడేందుకు రాత్రి పూట పోలీసులు మరింత అప్రమత్తంగా పనిచేస్తూ, ప్రజల భద్రత కోసం 24 గంటలు సిద్ధంగా ఉన్నారు. నేరాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఈ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.