
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ టి, వెంకట్రావు డిమాండ్
నోయిడా కార్మికులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ" ఏప్రిల్ 21తేది న కార్మికుల డిమాండ్స్ డే "గా పాటించాలని ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు టంగుటూరు మండల కేంద్రంమూడు బొమ్మలు సెంటర్ లొ సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్(ఐ ఎఫ్ టి యు అనుబంధం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది,
ఈ నిరసనకార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ టి, వెంకట్రావు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ బుద్ధ నగర్ లోని నోయి డా పారిశ్రామిక కారిడార్ కార్మికులు వేతనాలు పెంచాలని,పని ప్రదేశంలో మెరుగైన పరిస్థితులు కల్పించాలని,పని ప్రదేశంలో భద్రత కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని, అప్రెంటిషిప్ సమయంలో ఇస్తున్న జీతాలు మొదట గంటకు 90 రూపాయలు చొప్పున ఇచ్చే వారిని, దాన్ని 50 రూపాయలకు తగ్గించాలని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 11వ తేదీ నుంచి 45,000 మంది నోయిడా కార్మికులు సమ్మెకు దిగారు, ఏప్రిల్ 13వ తేదీన సమ్మె చేస్తున్న 45 వేల మంది నోయిడా కార్మికులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జి చేసి, భాష్పవాయువు ప్రయోగించింది, 350 మంది కార్మికులను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న నోయిడా కార్మికులపై ఉత్తరప్రదేశ్ లేబర్ మినిస్టర్ అనిల్ రాజ్ బార్ కార్మికుల ఆందోళన వెనక పాకిస్తాన్ హస్తముందని ఆరోపించడం అత్యంత దుర్మార్గమని కామ్రేడ్ టి, వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, అక్రమంగా అరెస్టు చేసిన కార్మిక నాయకుడు ఆతిథ్య ఆనంద్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి య పి, మాధవ, ఎ, మునివర, కె, నారాయణ,యస్, జా లరామయ్య తదితరులు పాల్గొన్నారు