
తొలి శుభోదయం :-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండల కేంద్రంలో తన్నీరు తిరుమలరావు జయభారతి ల కుమారుడు తన్నీరు త్రినాథ్ (కీర్తి మెడికల్స్) ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వామి పడిభజన పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి అభిషేకం కార్యక్రమంలో భాగస్వామి అయ్యి, స్వామివారి కటాక్షం పొందడం జరిగింది. ఈ పూజలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవాని మాతలు, ఆంజనేయ స్వాములు లతో కలిసి పడిభజన పూజా కార్యక్రమంలో స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్, భక్తులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.