
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
లింగసముద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి గుంటుపల్లి శ్రీనివాసులు పదవీవిరమణ కార్యక్రమం కందుకూరు పట్టణంలోని లక్ష్మీతిరుమల కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, శ్రీనివాసులు దంపతులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగిగా గుంటుపల్లి శ్రీనివాసులు చక్కటి సేవలు అందించారని, మంచి అధికారిగా ప్రజల్లో గుర్తింపు పొందారని ప్రశంసించారు. శ్రీనివాసులు శేషజీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని నాగేశ్వరరావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.