
వార్డెన్ ల పనితీరు, హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై ఐవిఆర్ఎస్ ద్వారా విద్యార్థుల నుంచి అభిప్రాయాల సేకరణ
తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ వసతి, భోజన సౌకర్యం
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోషల్ వెల్ఫేర్ డీడీలతో మంత్రి డా.స్వామి సమీక్ష
తొలి శుభోదయం అమరావతి:-
పది, ఇంటర్ పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రతి విద్యార్థి పాసవ్వాలని అన్ని హోస్టళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో సోషల్ వెల్ఫేర్ డీడీలతో మంత్రి జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే అంశంపై మంత్రి సమీక్ష చేశారు. ముందుగా గత ఏడాది పరీక్ష ఫలితాలను జిల్లాల వారీగా జిల్లాల వారీగా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అన్ని హాస్టల్స్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి, అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించి విద్యార్థులను సన్నద్ధం చేయాలి. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారికి ట్యూటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. విద్యార్థుల చేత రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్ పుస్తకాలు చదివించాలి.విద్యార్థులకు వార్డెన్ లు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి, ఎంసెట్, ఐఐటీ నీట్ కి దరఖాస్తు చేయించాలి. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ ప్రతి జిల్లాలో ఒక చోట వసతి, భోజన సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలి. మెనూ, వార్డెన్ ల పనితీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ఐవిఆర్ఎస్ ద్వారా విద్యార్థుల నుంచి అభిప్రాయాల సేకరిస్తున్నాం. విద్యార్థుల సంతృప్తి పెంపే లక్ష్యంగా వార్డెన్ల పనితీరు, పారిశుధ్య నిర్వహణ ఉండాలి. విద్యార్థుల ఆరోగ్యం భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ వర్కర్స్ నియమిస్తున్నాం. అన్ని హాస్టల్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పీఎం అజయ్ కింద రాష్ట్రంలో 26 నూతన హాస్టళ్లు నిర్మిస్తున్నాం. నిర్మాణ పనుల్ని డీడీలు పర్యవేక్షించాలని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారుల్ని ఆదేశించారు. ఈ సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ IAS బి. లావణ్య వేణి, అన్ని జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
