
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాలు, అపజయాలు సహజమని పేర్కొంటూ, ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు.
పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎవరూ నిరాశ చెందకూడదని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఫెయిల్ అయిన విద్యార్థులను తల్లిదండ్రులు మందలించకుండా, ఓదార్చి ప్రోత్సహించాలని సూచించారు.
సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని గుర్తుచేస్తూ, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదని స్పష్టం చేశారు. విద్యార్థులు భావోద్వేగాలకు లోనై తప్పు నిర్ణయాలు తీసుకోకూడదని, జీవితం ఎంతో విలువైనదని కలెక్టర్ పునరుద్ఘాటించారు.