
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భం గా స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి కంభం సెంటర్ వరకు వైద్యఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వ హించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియావ్యాధి అరి కట్టడానికి 2008 సంవత్సరం నుండి ప్రపంచ మలేరియా దినముగాప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించ డానికి ఈసంవత్సరం మలేరియా అంతం మన పంతం అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించ డానికి ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మలేరియా వ్యాధిచాలా ప్రాణాం తకమైన వ్యాధని వ్యాధిబారిన పడ కుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని ఆమె చెప్పారు. గ్రామాల్లో మరిము పట్టణ ప్రాంతాల్లో నీరు నిల్వలులేకుండా పరిసరాలను పరిశుభ్ర తగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. మార్కాపురం జిల్లాలో 60 వేల మందికి మలేరియా పరీక్షలు చేపట్టడం జరిగిందని ఎవ్వరికి కూడా పాజిటివ్ రాలేదని ఆమె చెప్పారు. అనంతరం ఖమ్మం సెంటర్ లో వైద్యఆరో గ్యశాఖ అధికారు లతో సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.బి.మనష్ ,జిల్లా ఎయిడ్స్ కంట్రొల్ అధికారి డాక్టర్ రాహుల్, డాక్టర్ శ్రావణి ,డాక్టర్ అనూష డాక్టర్ చేతన్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.