
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య స్థానిక ఎస్సై నాగరాజు తో కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి పరీక్షా నిర్వహణ అధికారికి తెలిపారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఆప్రాంతాలలోగుంపులుగాఉండవద్దని సీఐ తెలిపారు.అంతేకాకుండా ఇప్పటికేపరీక్షకేంద్రాలసమీపంలోని జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని నోటీసులు ఇచ్చినట్లు సిఐ రామకోటయ్య చెప్పారు.పరీక్షాకేంద్రాలవద్దకాపీలనుప్రోత్సహించేందుకుఎవరైనాప్రయత్నిస్తేఅటువంటివారిపైచట్టపరమైన కఠిన చర్యలుతప్పవనిసీఐరామకోటయ్య తీవ్రంగా హెచ్చరించారు.