
తొలి శుభోదయం న్యూస్ తర్లుపాడు:-
పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని చంపడం కంటే సంరక్షించడం మిన్నని మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ విద్యలో భాగంగా "పాములు - పర్యావరణ హితకారులు" అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్ విద్యార్థులకు వివిధ రకాల పాములను చూపిస్తూ వాటి లక్షణాలను వివరించారు. ముఖ్యంగా:విషపూరిత మరియు విషరహిత పాములు పై ఏ పాములు ప్రమాదకరమైనవి, ఏవి కావుఅనేవిషయాలనువిద్యార్థులకువివరించారు.పాముకుట్టినప్పుడుభయపడకుండా తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తల గురించి చెప్పారు. పాము కాటుకు నాటు వైద్యం చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే 'పాలివినం' (Anti-venom) మందు ప్రాణాలనుకాపాడుతుందనివివరించారు.వన్యప్రాణులపైవిద్యార్థులకుఉన్నభయాందోళనలను తొలగించి, వారిలోఅవగాహనకల్పించిననిరంజన్నుపాఠశాలప్రధానోపాధ్యాయులుయం.సుధాకర్,విద్యాశాఖఅధికారిఅచ్యుత్.సుబ్బారావుఅభినందించారు.ఈకార్యక్రమంలోఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.