
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు అధికారులు గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, గ్రామ పరిస్థితులు, స్థానిక అంశాలను తెలుసుకున్నారు.అధికారులు ప్రజలకు ప్రస్తుత సమాజంలో విస్తరిస్తున్న సైబర్ నేరాల ప్రమాదం, ఆన్లైన్ భద్రత, వ్యక్తిగత సమాచార రక్షణ, రోడ్డు భద్రత నియమాల ప్రాధాన్యత, అలాగే హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రాణ రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.గ్రామస్తుల నుంచి వచ్చిన సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, ఎటువంటి అసాంఘిక / చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఇటీవలి రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణనష్టం అధికమైందని పేర్కొంటూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.సైబర్ నేరాల బారినపడిన పౌరులు వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
