
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా సింగరాయకొండ పీహెచ్ సి డా: వంశుధర్, మసూద్ అలీ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ ఆర్టిసి బస్టాండ్ నందు పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలం జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగినది. రాజేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకొని వారి నిండు నూరేళ్ల జీవితం కాపాడుకోవాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రతి చోట పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, సాంత్వన సేవ సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్, మరియు వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ పాల్గొనడం జరిగినది.
