
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
దశాబ్దాలనుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైసిపికి కంచుకోటగా నిలిచిన ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో… తెలుగుదేశం గాలి బలంగా వీస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కృషి, అభివృద్ధి పాలన చూసి… ఈ 20 నెలల్లో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోయారు. తాజాగా మరో 53 కుటుంబాల వారు ఎమ్మెల్యే సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో మంగళవారం చేరికల కార్యక్రమం జరిగింది. బద్దిపూడి గ్రామానికి చెందిన గూడూరు రాజేంద్రరెడ్డి, తాటిపర్తి కృష్ణారెడ్డి, చిరే వెంకట సుబ్బారెడ్డి, మల్లికార్జునరెడ్డి, కూనం మాల్యాద్రిరెడ్డి, కృష్ణారెడ్డి, చేజర్ల శంకరరెడ్డి, గుండాల సింగారెడ్డి, బల్లికూర వెంకటేశ్వర్లు, దద్యాసి మాలకొండయ్య, శ్రీను, అన్నవరపు వెంకటేశ్వర్లు, తన్నీరు రాంబాబు, విష్ణు, తాటితోటి మాలకొండయ్య, చినమాలకొండయ్య, మంచాల కోటేశ్వరరావు, వింజమూరు ఏడుకొండలు, ఉరందూరి శ్రీహరి, నల్లబోతు తిరుపతి, పొట్లూరి రామారావు, ఆచారపు వెంకటేశ్వర్లు, మెండా ఆదెయ్య, దాసరి తిరుపతి సహా మొత్తం 53 కుటుంబాల వారు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత వైసిపి పాలనలో అభివృద్ధి అన్నదే చూడలేకపోయామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పూర్తిగా అభివృద్ధిపై దృష్టిపెట్టిన విధానం తమకు బాగా నచ్చిందన్నారు. బద్దిపూడితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇంటూరి మార్క్ పాలన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి నాగేశ్వరరావు గెలుపు కోసం కష్టపడతామని చెప్పారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ….. పార్టీలకతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. బద్దిపూడి గ్రామస్తులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని మరచిపోనని, కొత్తగా పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, గౌరవం తప్పక ఉంటాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బద్దిపూడిలో పసుపు జెండా ఎగరాలని ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు కూనం బ్రహ్మానంద రెడ్డి, ఇతర నాయకులు తెల్లబాటి ఆదినారాయణ, గూడూరు రాజేంద్ర రెడ్డి, బండి తిరుపతిరెడ్డి, దమ్ము రవికుమార్, కూనం తాతిరెడ్డి, చేజర్ల సందీప్ రెడ్డి, తాటితోటి శ్రీనివాసులు, తన్నీరు అంకమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.