
పోస్టర్ ఆవిష్కరణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం
తొలి శుభోదయం సింగరాయకొండ:-
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండ కార్యక్రమాన్ని ఈనెల 13వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగరాయకొండ మండలంలోని పాకల మేజర్ పంచాయతీలో అంబేద్కర్ నగర్ జరుపుతామని కొండేపి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీపతి సతీష్ వెల్లడించారు. సింగరాయకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.కె రసూల్ కార్యాలయంలో పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కూలీలకు పని కల్పించే హక్కు కాస్త ఈ బిజెపి ప్రభుత్వం బానిసత్వంగా మార్చిందని ఇది మంచి పద్ధతి కాదు అని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ కే సైదా మాట్లాడుతూ ఈ దుర్మార్గమైన బిజెపి ప్రభుత్వాన్ని అంతం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా శ్రమిస్తుందని తెలిపారు. కార్యక్రమ పరిశీలకులు పీసీసీ ప్రధాన కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఊపిరి తీయాలని చూస్తుందని దీన్ని చేదించడానికి షర్మిలమ్మ యాత్ర చేపట్టిందని తెలిపారు. పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ షర్మిలమ్మ చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జి శ్రీపతి సతీష్ మాట్లాడుతూ 13వ తేదీ నెల్లూరు నుండి బయలుదేరిన యాత్ర ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సింగరాయకొండ ముఖద్వారం కు చేరుకొని ఊళ్ళ పాలెం రైల్వే బ్రిడ్జి మీదుగా దేవుడు పాట ద్వారా సోమరాజు పల్లె మీదగా పాకలలోని అంబేద్కర్ నగర్ లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని కావున ఈ రచ్చబండకు వామపక్ష నాయకులను ప్రజా సంఘాల నాయకులను జిల్లా కాంగ్రెస్ నాయకులను వివిధ నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులను యువజన విద్యార్థి విభాగాల నాయకులను ఆహ్వానిస్తున్నామని ఈ రచ్చబండ జయప్రదం చేయాలని కోరుతున్నాం అని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ మన్నం ప్రసన్న రాజు డిసిసి ఉపాధ్యక్షులు కాకర్లపూడి వేణు మార్కాపురం మైనార్టీ సెల్ చైర్మన్ మహబూబ్ వలి యువజన కాంగ్రెస్ నాయకులు రాజేష్ సోమరాజు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు పాకల గ్రామంలోని రచ్చబండ జరిగే కార్యక్రమం ఏర్పాట్లను పరివేక్షించారు.