
తొలి శుభోదయం సింగరాయకొండ:-
తుఫాన్ ప్రభావంతో పాకల గ్రామంలోని పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్న ప్రజలకు వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండలం పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కేశవరపు కృష్ణారెడ్డి, రావూరు ప్రభావతి, భాస్కర్ రెడ్డి, మహేష్, రాఘవులు, కుర్ర ప్రసన్న, కళ్యాణ్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధితులకు అవసరమైన సహాయం అందించారు. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పార్టీ తరఫున పూర్తి మద్దతు అందిస్తామని నాయకులు తెలిపారు.