
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
స్థానిక పార్కు వీధి ప్రాధమిక పాఠశాలను గురువారం ఎంఈఓ-1 అబ్దుల్ సత్తార్ , ఆకస్మికంగా తనిఖీ చేశారు.అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు, డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలు,జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా అభ్యసన స్థాయిలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్యారెంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి కార్యచరణ ప్రణాళికల ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి,నిర్దేశిత సమయంలో విద్యార్థులందరినీ స్కై లెవెల్లో ఉంచేందుకు ఉపాద్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. 75 రోజుల కార్యాచరణ ప్రణాళికలో 60 రోజుల ప్రగతిని సమీక్షించారు. ఉర్దూ భాషలో అక్షరాల ఎంపిక ద్వారా పదాలను సృష్టిస్తూ,ప్రతిపదార్థాలను వివరిస్తూ,అలవోకగా ఉర్దూ భాషపై పట్టుబిగిస్తున్న విద్యార్థులను ఎంఈవో ప్రశంసించారు.విద్యార్థులు ప్రాధమిక దశలోనే తెలుగు,ఆంగ్లం,ఉర్దూ భాషలపై అవగాహన కలిగివుండటం అభినందనీయమనీ, బహుభాషా సామర్ధ్యాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే సొంతమని అన్నారు.కార్యక్రమంలో సిఆర్పీ మురళీమోహన్, ప్రధానోపాధ్యాయురాలు డి.వి.అరుణ , ఉపాద్యాయులు రేష్మాభాను, వి.మార్క్ , ఖాశీంబాషా , పాల్గొన్నారు.