
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, వైస్సార్సీపీ (P.A.C) సభ్యులు, కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి డా. ఆదిమూలపు సురేష్ ముఖ్య నాయకత్వం వహించారు.కలియుగ దైవంగా పూజింపబడే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై జంతు కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసి లడ్డు పవిత్రతను అవమానించిందని వైస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అపచారానికి పరిహారంగా, భక్తి భావంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు నిర్వహించామని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, దైవద్రోహానికి తగిన పరిహారం కలగాలని, ప్రజల మనోభావాలకు న్యాయం జరగాలని ప్రార్థించారు. మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సరికాదని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.
