
టి టి డి కళ్యాణ మండపం పనులు త్వరిత గతిన పూర్తి చెయ్యాలి.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం .పాత సింగరాయకొండ. ప్రకాశం జిల్లా. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సన్నెబోయినా శ్రీనివాసులు ఈరోజు దక్షిణ వైపు మెట్ల మార్గం పక్కన టిటిడి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న కళ్యాణ మండపం పనులను సమీక్షించారు.అదేవిధంగా టిటిడి ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ తో నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి దేవస్థానమునకు అప్పగించవలసిందిగా సూచించారు.ఈ కళ్యాణ మండపం పూర్తి అయితే స్వామివారి భక్తులకు శుభకార్యాలకు జరుపుకొనుటకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. టిటిడి అధికారులు కూడా 20 రోజుల్లో పనులు పూర్తి చేసి దేవస్థానమునకు కళ్యాణ మండపం స్వాధీనం చేస్తామని తెలిపియున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పి కృష్ణవేణి,ఆలయ సిబ్బంది బి.బ్రహ్మయ్య,ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు ధర్మకర్తల మండల సభ్యులు కృపా సాగర్ , తన్నీరు రమణయ్య,కొంజేటి మధు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.