
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
విడవలూరులో భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ, కూటమి పార్టీల నాయకులు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ గార్లకు ధన్యవాదాలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి.