
తొలి శుభోదయం న్యూస్:-
ఆంద్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , దిశా వారి ఆదేశాల మేరకు, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారు ఒంగోలు లోని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆఫీస్ నందు పి.ఎల్. హెచ్.ఐవి నెట్వర్క్ కోఆర్డినేషన్ మరియు ఫెసిలిటేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా లోకల్ డోనార్స్ సహకారంతో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క్లస్టర్ ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విధిగా మందులు మింగడం తో పాటు తగిన పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవచ్చని తెలిపారు. పి పి ఎన్ నెట్ సుజాత మాట్లాడుతూ లింక్ వర్కర్ ప్రోగ్రాం గురించి వారు అందిస్తున్న సేవల గురించి తెలియజేస్తూ హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారిని చిన్న చూపు, వివక్షతకు గురి చేయకూడదని వారిని ప్రేమతో ఆదరించాలని తెలిపారు.అలాగే దిశా నుండి సి ఎస్ ఓ సాయి మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారికి పౌష్టికాహారం అందించడం అబిందనీయమని తెలియజేశారు. వివిధ డోనర్స్ నుండి కలెక్ట్ చేశామని అలాగే డోనర్స్ సహాయంతో సేకరించిన పౌష్టికాహారాన్ని 10 మందికి హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారికి పంపిణీ చేశారు.అలాగే వచ్చిన వారికి టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దిశా నుండి సి ఎస్ ఓ సాయి , సి పి వో కిరణ్ కుమార్ రెడ్డి ,నెట్ వర్క్ సుజాత , గ్రో టీ ఐ పి యం భాషా గారు,చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ జిల్లా రిసోర్స్ పర్సన్ గాలి స్వరూప్ కుమార్ , టీ ఐ నుండి ఔట్ రీచ్ వర్కర్స్,జోనల్ సూపర్వైజర్ అనిల్ కుమార్, భాస్కర్,లింక్ వర్కర్స్ మరియు PLHIV కమ్యూనిటీ వారు పాల్గొన్నారు..