
తొలి శుభోదయం కందుకూరు:-
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే 135 వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతను స్మరించుకుంటూ స్థానిక పామూరు రోడ్ లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు వర్ధంతి కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మహాత్మ జ్యోతిబాపూలే కి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ సాంఘిక సంస్కర్త సామాజిక న్యాయ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రములో అమలు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలను సాధికారత, రాజ్యాధికారం వైపు నడిపించారని కొనియాడారు.పూలే చూపించిన మార్గంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు, మహిళలు అందరూ ఐక్యంగా నడవాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సిపి నాయకులు అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో సామాజిక న్యాయ సాధన కోసం బీసీ సామాజిక న్యాయ నాయకులు బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలసి ఐక్యంగా పనిచేస్తుందని తెలిపారు. ముందుగా మహాత్మ జ్యోతిబాపూలే,సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు ద్రోణాదుల చైతన్య, జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రెటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు గేరా మనోహర్, రాష్ట్ర ప్రచార కమిటీ నాయకులు వల్లూరి కోటేశ్వరరావు,పట్టణ ఉపాధ్యక్షులు తల్లపనేని గోపి, పట్టణ ప్రచార అధ్యక్షులు కొల్లిపర శ్రీనివాసులు, పట్టణ రైతు అధ్యక్షులు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు.పార్టీ బీసీ నాయకులు కొచర్ల కొండయ్య, ద్రోణాదుల మణిబాబు, పేయ్యల రమణయ్య, కొంచర్ల మాల్యాద్రి, యల్లావుల మురళి కృష్ణ, ఉప్పుటూరి నాగేశ్వరరావు, ఉండేల కొండారెడ్డి, మహమ్మద్ ఫైరోజ్, దాసరి మహేష్, కూరపాటి వెంకట్రామిరెడ్డి,జిల్లెలముడి కోటేశ్వరరావు, షేక్ సుల్తాన్, చల్లా శ్రీనివాసులు, గంగాడి వెంకట్రావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు కొత్తగొర్ల వసంత లక్ష్మి, అంగనవాడి అధ్యక్షురాలు దేవరకొండ ఆదిలక్ష్మి, తన్నీరు ధరణి తదితరులు పాల్గొన్నారు.