
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
జిల్లాలో పెట్రోల్ బంకులపై కలెక్టర్ పి. రాజాబాబు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టంగుటూరు మండలంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పలు ఆయిల్ బంకులను సందర్శించి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు వాహనదారులకు ఇంధనం సరఫరా విధానాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా బంకు నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్, డబ్బాలలో లేదా బల్క్‌గా ఆయిల్ పోయకూడదని హెచ్చరించారు. ముందుగా బిపిసిఎల్ డిపోను సందర్శించిన ఆయనకు, జిల్లాలో 74 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని అధికారులు వివరించారు.అనంతరం శివపురం, సూరారెడ్డిపాలెం ప్రాంతాల్లోని హెచ్‌పిసిఎల్, ఐఓసీఎల్ బంకులను కూడా పరిశీలించిన కలెక్టర్, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా తక్షణమే ఇండెంట్ పంపించాలని సూచించారు.ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని బంకుల వద్ద నియమించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.
