
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పెర్నమిట్ట గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిని తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ సందీప్ మరియు సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు.ఈ దాడుల్లో 7 మందిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.10,900/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.