
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు ₹31,73,000/- (31 లక్షల 73 వేల రూపాయల) విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేయడం జరిగింది.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, భారీ ఖర్చులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ చెక్కులు ఆర్థిక భరోసానిస్తాయని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. వారందరూ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.