
మెకనైజ్డ్ కిచెన్లతో విద్యార్థులకు పరిశుభ్ర, నాణ్యమైన పోషకాహారం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ,:-
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడిన అనంతరం పాఠశాలలో మెకనైజ్డ్ కిచెన్ ని పరిశీలించారు. మెకనైజ్డ్ కిచెన్ నిర్వహణ పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలోని 14 బెంచ్ మార్క్ అంబేద్కర్ గురుకులాల్లో రూ.1.39 కోట్లతో ఆధునిక వంట పరికరాలతో మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేశాం. మెకనైజ్డ్ కిచెన్లతో విద్యార్థులకు పరిశుభ్ర, నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నాం. వంట మనుషులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. పేద విద్యార్థుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు ఎంత ఖర్చునైనా తమ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
