
తొలి శుభోదయం పోన్నలూరు:-
పోన్నలూరు మండల
పరిధిలోనిచెరువుకొమ్ముపాలెం గ్రామంలో పొగాకు రైతులకు పొగాకు లో పురుగు మందుల అవశేషాలు నిర్మూలన, అన్య పదార్థాలు నిర్మూలన, తల ట్రుంచుట, పొగాకు ఉత్పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు శిక్షణ సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్య క్రమంలో 26వ పొగాకు బోర్డు వేలం కేంద్రం నిర్వహాణాధికారి వి. శివకుమార్ మాట్లాడుతూ పొగాకు పంట లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. నారును తగిన సమయం లో పొలంలో నాటలని పేర్కొన్నారు. సమగ్ర సన్య రక్షణ చర్యలు,ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడుతో పాటు నాణ్యమైన పొగాకును ఉత్పతి చేయవచ్చు అని తేలిపారు. రైతులు ఉత్తమ యజమాన్య పద్ధతులను పాటించాలనీ,విచ్చలవిడి గా పురుగుమందులు వినియోగించడం వలన వచ్చే అనర్థాలు వివరించారు, బోర్డు వారు సిఫారసు చేసిన పురుగు మందులనే ఉపయోగించాలని తెలిపారు.రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకం లో తగు జాగ్రత్తలు పాటించాలని ప్రధానం గా జీవామృతం ఎరువులను పచ్చిరోట్ట ఎరువులు వినియోగించాలని అన్నారు. రైతులు పొగ నాట్లు ఒకేసారి కాకుండా రెండు మూడు దఫాలుగా సాగు చే సుకోవాలని తెలిపారు.పొగాకు పంటలోసిటిఆర్ఐఅధికారులు సూచించిన పురుగు మందులను మాత్రమే అవసరం అయిన మోతాదులో పిచికారి చెయ్యాలి అన్నారు. పొలం, బారన్ కౌలు ను సైతం తగ్గించాలనీ అన్నారు. పొగాకు లో ఈ అన్య పదరదలు లేకుండా చూసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమం లో ఐ.టి.సి కంపెనీ ప్రతినిధి విజయ్ , జి.పి.ఐ కంపెనీ ప్రతినిధి ఉన్నం శ్రీనివాస్ , పొగాకు రైతులు, పొగాకు బోర్డు క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.