
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు 26,27 పొగాకు వేలం కేంద్రాలలో ప్రతిరోజు కనీసం 100 బేళ్ళకు తగ్గకుండా కొనుగోళ్లు చేసేవిధంగా ప్రజా ప్రతినిధులు,బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని, తద్వారా కందుకూరు నియోజకవర్గం లోని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ. వీ కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కందుకూరు పట్టణం లోని సుందరయ్య భవన్ లో సిపిఎం కందుకూరు నియోజకవర్గ స్థాయి వర్క్ షాప్ ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్.ఏ. గౌస్ భాషా అధ్యక్షత వహించారు. ఈ వర్క్ షాప్ కు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ.వీ. కొండారెడ్డి,యం.రమేష్ లు హాజరయ్యారు. మీటింగ్ లో మాట్లాడారు. ఈ సీజన్ లో కొనుగోళ్ల ప్రారంభించడమే ఆలస్యం అయిందని అన్నారు. కొనుగోళ్లు లో కనీసం 15మంది బయ్యర్లు ఉండాల్సిఉంటే 8 మందే ఉన్నారని అన్నారు. కొనుగోళ్లు లో 100బేళ్లు పెడుతుంటే వాటిలో 20 శాతం రిటర్న్ అవుతున్నాయని అన్నారు. ఇంత మందకోడి గా వేలం జరుగుతున్నందున, పోగాకు నిరుత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు.ఈ రకంగా జరిగితే జనవరి మొదటి వారం దాకా కొనుగోళ్లు ఉంటాయని అన్నారు. దీనివల్ల పోగాకు రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు. పోగాకు కొనుగోళ్ల సందర్బంలో ప్రజాప్రతినిధులు తరచూ బోర్డు ను సందర్శించాలని కోరారు. గతం కంటే పోగాకురైతులకు ఖర్చులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిలో ధర 300 ఎవరేజ్ ఉండేటట్లు చూడాలని డిమాండ్ చేశారు. వేసవి లో ఎండలు తీవ్రంగా ఉన్న రీత్యా గ్రామాలలోని ప్రజలకుత్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కందుకూరు నియోజకవర్గం లోని అన్నీ గ్రామాలలో ఉపాధి పనులు ప్రారంభించి, కూలీలను ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం.రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లోని ప్రజలవద్దకు సిపిఎం కార్యకర్తలు ఉద్యమనిధి కొరకు వస్తారని తెలిపారు.ఉదారంగా సహకరించాలని కోరారు. నియోజకవర్గసమస్యలపై సిపిఎం గుడ్లూరు, ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శులు జీ. వెంకటేశ్వర్లు,జీవీబీ కుమార్ లు మాట్లాడారు.ఈ సమావేశాల్లో కందుకూరు పట్టణం, గుడ్లూరు, వలేటివారిపాలెం, ఉలవపాడు,లింగసముద్రం మండలాలలోని సిపిఎం నాయకులు షేక్.మున్వర్ సుల్తానా,మల్లిక,యం.పద్మ కొట్టే వెంకయ్య, దామా.కృష్ణయ్య, బీరకాయల వెంకటేశ్వర్లు, మాదాల రమణయ్య, దువ్వూరి జాన్, గుండ్లతోటి మాధవ మూర్తి, పర్రె.భాస్కర్ రావు, ఎస్ డి గౌస్ బాషా,ఇందిరావతి, కే శేషమ్మ, గంజి ప్రసాద్, జి శివకుమార్,పొందూరి. కొండమ్మ, నారాయణ, ఎస్. సరేంద్ర తదితరులు పాల్గొన్నారు
