
తొలి శుభోదయం కందుకూరు:-
విశ్వనాథ పురం గ్రామం లో గురువారం పొగాకు నారుమడుల యాజమాన్యం,పొగాకు రైతులు నాట్లు సమయంలో పాటించవలిసిన యాజమాన్య పద్ధతులు గురించి నిర్వహించిన శిక్షణ కార్య్రమం లో కందుకూరు రెండవ వేలం కేంద్రం నిర్వహణాధికారి చంద్ర శేఖర్ మాట్లాడుతూ పొగాకు నారు, పంటపై మాగుడు, నారుకుళ్లు తెగుళ్లు ఆశించకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 20 గ్రాములు, ప్లాంటామైసిన్ మందును ఒక గ్రాము నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. అమిష్టర్ మందును పది మిలీ. పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ రాజా గోపాల్ మాట్లాడుతూ పొగాకు రైతులు అందరూ అంతర్జాతీయ పొగాకు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని అందరూ మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తక్కువ విస్తీర్ణం లో ఎక్కువ నాణ్యమైన పొగాకు పండించాలి అని సూచించారు. కార్యక్రమంలో ఐటీసీ మేనేజర్ గోలి వెంకటేష్ , జీపీఐ మేనేజర్ ఉన్నాం శ్రీనివాస్ , రామ కృష్ణ క్షేత్ర సహాయకులు, నాగేంద్ర, రవీంద్ర, సిసింద్రీ, మరియు విశ్వనాథపురం గ్రామ రైతులు పాల్గొన్నారు.